Monday, December 23, 2024

బుధవారం ఇస్లామిక్ దేశాల బృందం అత్యవసర భేటీ

- Advertisement -
- Advertisement -

రియాద్ : ఇజ్రాయెల్ గాజా యుద్ధంపై చర్చించేందుకు ఇస్లామిక్ దేశాల బృందం అత్యవసర , అసాధారణ సమావేశం జరుగనుంది. ఇప్పటి పరిస్థితుల నడుమ ఈ భేటీ ఏర్పాటు అవసరం అని సౌదీ అరేబియా శనివారం ప్రకటించింది. రియాద్‌లో ఇప్పుడు జరుగుతోన్న ఇస్లామిక్ సదస్సుకు సౌదీ అధ్యక్షత వహిస్తోంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఒఐసి) సమావేశం బుధవారం జెడ్డాలో జరుగుతుందని, దీనికి సభ్య దేశాలు అన్ని హాజరు కావాలని సౌదీ అరేబియా పిలుపు నిచ్చింది. సైనిక చర్యలు తీవ్రతరం కావడం,

గాజాలో నిరాయుధులైన పౌరులకు ముప్పు వాటిల్లడం వంటి అంశాలను ఈ అత్యవసర సమావేశంలో సమీక్షించుకుంటారని వెల్లడైంది. సంస్థకు చెందిన కార్యనిర్వాహక మండలి తక్షణం అసాధారణ సమావేశం కానుందని, దీనికి మంత్రుల స్థాయి ప్రతినిధులు హాజరుకావాలని కోరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు యుద్ధం విస్తరించుకుంటోంది. సాధారణ పౌరుడికి రక్షణ లేదని, పశ్చిమాసియా ప్రాంతం అంతా భద్రతా సుస్థిరత ప్రమాదంలో పడిందని, వీటిపై తక్షణం దృష్టి సారించాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడుతోందని ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News