- Advertisement -
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఓ చీకటి యుగమని, ప్రజాస్వామ్యానికి మద్దతు ఇచ్చే వారిపై అకృత్యాలు జరిగాయని ప్రధాని మోడీ గుర్తు చేశారు. భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, మన ప్రజాస్వామిక సిద్ధాంతాలు అత్యున్నతమైనవని, మన రాజ్యాంగం సర్వోత్కృష్టమైనదని చెప్పారు. అయితే జూన్ 25 మనదేశంలో ఎమర్జెన్సీని విధించిన రోజు అని, దాన్ని ఎన్నటికీ మర్చిపోబోమన్నారు. 1975లో అప్పటి ప్రదాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే.
- Advertisement -