హైదరాబాద్: యాంకర్ ప్రదీప్ మాచిరాజు తండ్రికి కరోనా వైరస్ సోకడంతో చనిపోయాడు. తండ్రి మృతితో తీవ్ర బాధలో ఉన్న ప్రదీప్‌గా తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఐ లవ్ యు నాన్న తాను ఇప్పటికి ఇలా ఉన్నానంటే దానికి తన తండ్రి కారణమన్నారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చిన చిరునవ్వుతో ఎదుర్కునేలా తర్పీదు ఇచ్చారని గుర్తు చేశారు. సంఘంలో మీకు గౌరవం కలిగించేలా నడుచుకుంటానని, తన ప్రతి నిర్ణయం వెనుక ఎలప్పుడు అండగా ఉన్నారని కొనియాడారు. బాధతో ముక్కలైన తన మనస్సును ప్రేమతో బాగు చేశారని, మీ దైర్యమే నాకు స్ఫూర్తి అని, తన కాళ్ల మీద తాను నిలబడేలా పెంచి పోషించారని, నా జీవితం మీరే అని, జీవితంలో మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ఆపాను అని అన్నారు. తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ నవ్విస్తూనే ఉంటానని, మనం కలిసే దాకా మిమ్మల్ని మిస్ అవుతానని, ఐ మిస్ యు డాడీ అంటూ ప్రదీప్ బాధతప్త హృదయంతో తెలియజేశాడు.
ఆ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టు….
- Advertisement -
- Advertisement -
- Advertisement -