Thursday, January 23, 2025

టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి

మన తెలంగాణ / అలంపూర్ / హైదరాబాద్ : ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక విలువలు పెంపొందిస్తూ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జోగులాంబ అమ్మవారిని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి జూపల్లికి అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. మంత్రికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ జోగులాంబ ఆలయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, టెంపుల్ టూరిజానికి ప్రాధన్యతనిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో భాగంగా చేపట్టిన పనులు ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని, త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. భక్తుల సౌకర్యాల నిమిత్తం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎంఎల్‌ఏలు మేఘారెడ్డి, వంశీకృష్ణ, రాజేశ్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, మాజీ ఎంఎల్‌ఏ సంపత్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Temple tourism 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News