Sunday, December 22, 2024

పని ఒత్తిడి…. బ్యాంకులోనే కుప్పకూలి ఉద్యోగిని మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఓ ఉద్యోగిని బ్యాంకులో పని చేస్తుండగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. బ్యాంకు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం….. లక్నోలోని గోమతి నగర్ లోని హెచ్ డిఎఫ్ సి బ్యాంకులో సదాఫ్ ఫాతిమా అనే మహిళ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆఫీసులు కూర్చీలో కూర్చొని పనిచేస్తుండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. ఈ సంఘటన ఎస్ పి అధక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ తన ట్విట్టర్ లో విచారం వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో ఆమె చనిపోవడం బాధాకరమైన విషయమన్నారు. ప్రస్తుతం కార్పొరేటు విధానాలతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని దుయ్యబట్టారు. పని ఒత్తిడి గురించి ప్రభుత్వాలు, కంపెనీలు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మానవ వనరు కోల్పోవడం అనేది పూడ్చలేని లోటు అని తెలిపారు. బిజెపి విఫల ఆర్థిక విధానాలతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ లో విధులు నిర్వహిస్తున్న కేరళ యువతి సెబాస్టియన్ మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News