Friday, November 22, 2024

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార స్వామి

 

మనతెలంగాణ/హైదరాబాద్:  ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీ) రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార స్వామి పేర్కొన్నారు. మంగళవారం డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (లక్డీకాపూల్)లోని కార్యాలయంలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (TEA) యూనిట్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులను నూతనంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చిలగాని సంపత్ కుమార స్వామి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉంటామన్నారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు బకాయి పడ్డ మూడు డిఏలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్త చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు జి.నిర్మల, గడ్డం బాలస్వామి కేంద్ర సంఘం కోశాధికారి, యుఎఫ్‌ఏ యాకూబ్ పాషా కేంద్ర సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి , అంజనీకుమారి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, హైదరాబాద్ అధ్యక్షుడు కొంకటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (TEA) డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యూనిట్ అధ్యక్షుడిగా ఆర్.సంతోష్ కీర్తి ఎన్నికకాగా ప్రధాన కార్యదర్శిగా టి.నాగరాజు, జి.రవిబాబు, ఏ.కవిత, జి.సైదానాయక్ తదితరులు ఎంపికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News