Friday, December 27, 2024

హీరో మోహన్‌బాబు ఇంట్లో చోరీ

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ఇంట్లో మరోసారి చోరీ జరిగింది. గతంలో ఫిలిం నగర్ లో ఉన్న ఇంట్లో జరగగా ఈసారి జల్‌పల్లిలోని మంచుటౌన్ షిప్‌లోని ఆయన నివాసంలో చోటుచేసుంది. ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న ఉద్యోగి రూ.10 లక్షలతో పరారయ్యాడు. పహాడీషరీఫ్ పోలీసుల కథనం ప్రకారం.. మహేశ్వరం నియోజవర్గం జల్‌పల్లిలోని మంచుటౌన్‌షిప్‌లో సినీనటుడు మోహన్‌బాబు గత 12 ఏళ్లుగా తన కుటుంబంతో కలి సి నివసిస్తున్నాడు. వద్ద కిరణ్‌తేజ్, సెక్రెటరీగాను గణేశ్ నాయక్ అనే వ్య క్తి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

సోమవారం తిరుపతిలోని అతని మరో వివాసం నుంచి రూ.10 లక్షలను కిరణ్‌తేజ్, గణేశ్‌లు తీసుకుని జల్‌వల్లిలోని మంచుటౌన్‌షిప్ ఇంటికి వచ్చారు. అనంతరం కిరణ్ తేజ్ తన గదిలోనికి వెళ్లి పడుకున్నా డు. తిరిగి వచ్చేసరికి గణేశ్ కనిపించలేదు. గదిలో చూడగా డబ్బులు కనిపించలేదు. దీంతో గణేశ్ నగదుతో ఉడాయించాడని గ్రహించి యజమాని మోహన్‌బాబుకు సమాచారం అందించాడు. మోహన్ బాబు సూచనల మేరకు కిరణ్ పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసిప్రత్యేక బృందాలను నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News