Sunday, December 22, 2024

4శాఖల్లో త్వరలో బదిలీలు?

- Advertisement -
- Advertisement -

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రెవెన్యూ

2017 తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఇదే తొలిసారి డివిజన్ల సర్దుబాటు వల్ల
ఎక్సైజ్ శాఖలో ఐదేళ్ల కన్నా ఎక్కువగా ఒకే ఉన్నవారికి ప్రాధాన్యం

మనతెలంగాణ/హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రెవెన్యూ శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రి య వచ్చేనెల ప్రారంభం కానుంది. ఈ నాలుగు శాఖలో చాలాఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోం ది. గతంలో ఈ శాఖలో బదిలీలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినా కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కావడం లేదు. వచ్చే నెలలో దీనికి సంబంధించిన ఫైలుపై ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ నాలుగు శాఖల్లో బదిలీల ప్రక్రియ ముందుకుపడలేదు. ఇప్పటికే ఎసిబి (అవినీతి నిరోధక శాఖ) కేసులు నమోదు చేసిన శాఖల్లో రె వెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు ముందంజలో ఉండగా వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ ల్లో అవినీతి అధికంగా ఉందని ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొంది. ఈ అవినీతికి ముఖ్యంగా చాలాఏళ్లుగా ఒకేచోట ఉద్యోగులు, అధికారులు బదిలీ చేయడం వల్లే జరుగుతుందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈ నాలుగు శాఖల్లో బదిలీలను చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆ దిశగా ఉన్నతాధికారులు ముందుకెళుతున్నారు.

2017లో 72మంది ఒకేసారి

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో 2017లో 72 మందిని ఒకేసారి బదిలీలు చేసిన ప్రభుత్వం తరువాత ఎలాంటి బదిలీల ప్రక్రియను చేపట్టలేదు. ఎక్సైజ్ శాఖలో కిందిస్థాయి ఉద్యోగుల బదిలీలను గత సంవత్సరం ప్రభుత్వం చేపట్టినా, ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ శాఖలో బదిలీలు జరగలేదని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. రెండు నెల ల క్రితం ఈ నాలుగు శాఖల ఉద్యోగుల వివరాలను సేకరించిన ప్రభుత్వం బదిలీలకు సంబంధించి ఫైలును ఫైనల్ చేసినట్టుగా తెలిసింది. వచ్చే నెలలో ఈ నాలుగు శాఖల్లో బదిలీలను చేపడితే చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు చెక్ పెట్టినట్టేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నాలుగు శాఖల్లో 2014 సంవత్సరానికి ముందు జరిగిన సాధారణ బదిలీలు తప్ప ఇప్పటివరకు పూర్తి స్థాయిలో బదిలీల తంతు జరగలేదని ఈ శా ఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

రెవెన్యూ శాఖలో పలు ఫోకల్ పాయింట్లలో ఫైరవీలు చేసుకున్న ఉద్యోగులే ప్రస్తుతం పాతుకుపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా శాఖల్లో ఉద్యోగుల బదిలీలపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొం ది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో 9 సంవత్సరాలు గా ఒకేచోట పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్‌లు ఉన్నా రు. చాలాకాలంగా ఒకేచోట పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్‌లు సైతం తమను బదిలీ చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు విన్నవించుకోవడం గమన్హారం. అదేవిధంగా డివిజన్ల సర్దుబాటు కారణంగా వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలు నిలిచిపోయాయి. ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణ పూర్తయినా బదిలీల ప్రక్రియ జరగడం లేదని ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల పరిధి, పనిస్వభావంలో చాలా మార్పులు వచ్చాయి. డీలర్లు పెరగడంతో ఉద్యోగులపై పనిభారం పెరుగుతుందని, ప్రభుత్వానికి రాబడిని సమకూర్చడంతో పాటు పన్నుల తీరును పకడ్బందీ చేయడంలో ఉద్యోగుల పాత్రను మరింత మెరుగుపరచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

250 మంది అయిదేళ్లుగా….

ఎక్సైజ్ శాఖలో ఏకంగా 250 మంది సిఐలు బదిలీలు లేకుండా అయిదేళ్లుగా ఒకే స్థానంలో కొనసాగుతున్నారు. గతంలో ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీ సర్ల (ఎస్‌హెచ్) కు రెండేళ్లకోసారి శాఖాపరమైన బదిలీలు జరిగేవి. అయిదేళ్లుగా అక్కడ ఎలాంటి బదిలీలు జరగలేదు. రాష్ట్రంలో 138 ఎక్సైజ్ స్టేషన్లు ఉండగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పనిచేస్తున్న సిఐలతో కలిపి దాదాపు 250 మంది అయిదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సిఐ పోస్టులు కీలకంగా మారడంతో బదిలీలు లేకుండా ఆ పోస్టుల్లో అధికారులు సుదీర్ఘకాలంగా కొనసాగడం అక్రమాలకు ఎక్కువగా జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News