Monday, December 23, 2024

కార్పొరేషన్ ఉద్యోగుల పిఆర్‌సికి సానుకూలత పట్ల ప్రభుత్వానికి ఉద్యోగుల కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్య వేతన సవరణ (పిఆర్‌సి)పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల కార్పొరేషన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వానికి, మంత్రి కొప్పుల ఈశ్వర్, చైర్మన్ వాసుదేవ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపింది. సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ఛాంబర్‌లో వికలాంగుల సమస్యలు, కార్పొరేషన్ ఉద్యోగుల సమస్యలు, పిఆర్‌సిపై చర్చించి వాటి పరిష్కారానికి సానుకూలంగా వ్యవహరించడం పట్ల యూనియన్ నాయకులు ఎస్. రాములు, జి. వెంకట్రాములు, ఎస్‌ఎన్ చారి, జి.వెంకటేశ్వర్ రావు, ఎం. రవీందర్, సయ్యద్ యాదుల్లా , జి. అంజయ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు. పిఆర్‌సి సమస్యను సాధ్యమైనంత త్వరగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News