Monday, December 23, 2024

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఉద్యోగులు సంబరాలు

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఆర్ టిసి ఉద్యోగులు

నిర్మ‌ల్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సిఎం కెసిఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నార‌ని, దీంతో 43వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు జరుగనుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం నిర్మ‌ల్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులతో క‌లిసి బిఆర్ఎస్ శ్రేణులు ట‌పాసులు కాల్చి సంబరాలు జ‌రుపుకున్నారు. సిఎం కెసిఆర్ చిత్రపటానికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. తాము ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతున్నందుకు సంతోషంగా ఉంద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Also Read: చారిత్రక నిర్ణయాలు చాటుకుందాం

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… వేలాది మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకున్న సిఎం కెసిఆర్ కార్మిక పక్షపాతి అని ప్రశంసించారు. 43 వేల మంది ఆర్ టిసి ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులను నింపిన ముఖ్యమంత్రి కృషి అభినందనీయమ‌ని కొనియాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్టిసి ఉద్యోగులు, కార్మికుల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుభాకాంక్ష‌లు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News