Monday, December 23, 2024

గుంటూరులో నడిబజారులో యువతిని పొడిచి చంపారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ యువతి దారుణ హత్యకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని షాప్ ఎంప్లాయిస్ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పదో లైన్‌లో గుర్తుతెలియని యువతి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయని గుర్తించారు. మృతురాలి చేతిపై దుర్గారావు అనే పచ్చబొట్టు ఉంది. గుంటూరులో వివిధ స్టేషన్లలో మిస్సింగ్ మహిళల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News