Thursday, January 23, 2025

ఉద్యోగుల కృషి అభినందనీయం : పోచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చట్టసభలు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు కనుకే రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం శాసనసభ కమిటీ హాల్ లో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు. రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, టిఎన్‌జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, జనరల్ సెక్రటరీ జగదీశ్, అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్, రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు స్పీకర్‌ను కలిశారు. ముందుగా శాసనసభ సమావేశాలను గ్యాలరీ ద్వారా సభ్యులు వీక్షించారు.

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉద్యోగులు గుండె లాంటి వారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలు తీసుకున్న నిర్ణయాన్ని క్షేత్ర స్థాయిలో అమలుచేసేది కార్యనిర్వాహక వ్యవస్థ. ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర మరువలేనిది. తమ ఉద్యోగాలను పణంగా పెట్టి ఉద్యోగులు 42 రోజులు సమ్మె చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తూ మేలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్‌జిఓ భవన నిర్మాణానికి రూ. 30 లక్షలు మంజూరు చేశానని స్పీకర్ పోచారం ఈ సందర్భంగా గుర్తుచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News