Sunday, December 22, 2024

చైనాలో కంచెలు దూకి పారిపోయిన ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

Employees escaped by jumping over fences in China

బీజింగ్ : చైనా కొవిడ్ జీరో పాలసీ ఆ దేశ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. లాక్‌డౌన్ పేరు వింటేనే వణికిపోతున్నారు. కొవిడ్ ఆంక్షలను తప్పించుకొనేందుకు జెంగ్‌ఝౌ లోని అతిపెద్ద ఫ్యాక్టరీ నుంచి సిబ్బంది ఫెన్సింగ్ దూకి బయటకు వెళ్తున్న దృశ్యాలు వెలుగు లోకి వచ్చాయి. వారంతా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వస్థలాలకు కాలినడకనే వెళ్తున్నట్టు సమాచారం. చైనా మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వారంతా ఫాక్స్‌కాన్ సిబ్బంది అని తెలుస్తోంది. జెంగ్‌ఝౌ నగరంలో అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు కంచెలు దూకుతున్నారు. అక్కడి నుంచి దొంగచాటుగా బయటపడి పారిపోతున్నారు ” అంటూ ఓ నెటిజన్ వీడియో షేర్ చేశారు. హెనాన్ జెంగ్‌ఝౌలో ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో యాపిల్ ఉత్పత్తులు అసెంబుల్ చేస్తారు. ఈ ఫ్యాక్టరీలో 3,50,000 మందికి ఉపాధి కల్పించే వీలుందని, అయితే 20 వేల మందికి వైరస్ సోకిందని చెబుతున్నారు. పలువురు సిబ్బందిని ఫాక్స్‌కాన్ సంస్థ క్వారంటైన్‌లో ఉంచిందని వార్తలు వచ్చాయి. ఉద్యోగుల సంచారంపై కఠిన ఆంక్షలు విధించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నుంచే కంచెలు దూకిన దృశ్యాలు బయటపడ్డాయి. ఈ వీడియోలు వెలుగు లోకి రావడంతో ఇంటికి వెళ్లాలనుకునే ఉద్యోగుల కోసం సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం వాహనాలను ఏర్పాటు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News