హైదరాబాద్ : ప్రస్తుత ఉమ్మడి జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జిపిఎఫ్) ఖాతా లను వారు పని చేస్తున్న కొత్త జిల్లా పరిషత్‌లకు బదలాయించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఆయా జిల్లా పరిషత్‌ల సిఈవోలను ఆదేశించింది. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల జిపిఎఫ్ ఖాతాలను కొత్త జిల్లాలకు మార్చుతూ ట్రెజరీ అకౌంట్స్ విభాగం కొన్ని నెలల క్రితమే ఉత్తర్వులు జారీచేసింది.
ఇది వరకు ఉన్న జిపిఎఫ్ ఖాతాలను ఉద్యోగులు ఏ జిల్లాలో పనిచేస్తే ఆయా జిల్లాకు బదిలీ చేయాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో 2016లో కొత్త జిల్లాలు ఏర్ప డ్డాయి. అయినా.. పాలనపరమైన కారణాల వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల జిపిఎఫ్ ఖాతాలు పాత పద్ధతి ప్రకారమే పది ఉమ్మడి జిల్లాల పరిధిలో కొనసాగాయి. తాజాగా సమీకృత జిల్లా కలెక్టరేట్ల భవనాలు అందుబాటులోకి వచ్చి పాలన గాడినపడిన నేపథ్యంలో.. ఉద్యోగ, ఉపాధ్యాయ ఖాతాలను వారు పనిచేస్తున్న జిల్లాలకు బదలాయించాలని ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది.