- Advertisement -
ఐఆర్‌తో ఉద్యోగులకు ఉపయోగం లేదు
మాలోత్ ప్రతాప్‌సింగ్
మన తెలంగాణ/ఇల్లందు టౌన్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ 5శాతం ఐఆర్ ప్రకటించడంతో ఉపాధ్యాయులు నిరాశకు లోనయ్యారని ఐఆర్‌తో ఉపయోగం లేదని టిఎస్ టిడబ్ల్యుటియూ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాలోత్ ప్రతాప్‌సింగ్‌నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు పిఆర్సీ కమిటీని ప్రభుత్వం నియమించడం హర్షనీయమైనప్పటకీ, మధ్యంతర భృతిని కేవలం 5శాతం ప్రకటించండం శోచనీయమన్నారు. డిఎలను పెండింగ్‌లో పెట్టి ఐఆర్ ప్రకటించడం వల్ల ఉద్యోగలకు ఎటువంటి లాభం లేకపోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను అవమానించడమేనని మండిపడ్డారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే జిఒను సవరించి తక్షణమే 20శాతం ఐఆర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -