Sunday, December 22, 2024

ఉద్యోగులు అంటే హక్కులే కాదు సామాజిక బాధ్యత కూడా కలిగి ఉంటారు

- Advertisement -
- Advertisement -

గోషామహల్: ఉద్యోగులు అంటే కేవలం హక్కుల సాధన కోసం పోరాటం చేయడమే కాదు సామాజిక బాధ్యత కూడా కలిగి ఉంటా రని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం అబిడ్స్‌లోని భీమా భవన్‌లో తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్‌రావు ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నారాయణగూడ సహకార ంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఖజానా లెక్కల శాఖ సంచాలకులు, సిపిఎస్ తెలంగాణ రాష్ట్ర నోడల్ అధికారి కెఎస్‌ఆర్‌సి మూర్తి ముఖ్యఅతిథిగా హాజరై, టీఎస్ జీఎల్‌ఐ డైరెక్టర్ కె శ్రీనివాస్, రాష్ట్ర ఆడిట్ శాఖ సంచాలకులు ఎం వేంకటేశ్వర్‌రావు, టీఎస్‌సీపీఎస్‌ఈయు రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్ర ధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్‌లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ మాట్లా డుతూ తలసేమియా అనేది జన్యు సంబంధిత వ్యాధి అని, మనదేశంలో సుమారు 5 కోట్ల మంది పిల్లలు ఈ ప్రాణాంతక మహమ్మారి బారినపడి మృ త్యువుతో పోరాడుతున్నారని, వారికి రక్తదానం చేసి, అండ నిలవడం మనందరి బాధ్యతగా గుర్తించాలని అన్నారు. తలసేమియా వ్యాధి బారిన పడిన చిన్నారుల కోసం ప్రతీ యేటా టీఎస్ సీపీఎస్‌ఈయు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్‌రావు నేతృత్వంలో రక్తదానం చేసి ఇతర సంఘాలకు అద ర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణమని అన్నారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్‌రావు మాట్లాడుతూ ప్రాణాంతకమైన తలసేమియా వ్యాధి మనిషి జీవించి ఉండగానే, నరకాన్ని చూపిస్తుందని అన్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారికి ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తాన్ని మార్చాల్సి ఉంటుందన్నారు.

పేదరికం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తలసేమియా వ్యాధి బాధిత పిల్లల ఆయుష్షు అర్దాంతరంగా ముగుస్తుందని, వారిని ఆదు కునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా ధృక్ఫథంతో రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వేసవి కాలంలో తలసేమియా వ్యాధిగ్ర స్తుల సంఖ్యలకు అనుగుణంగా రక్తం లేక కొరత ఏర్పడటంతో ప్రతీ యేటా వేసవి కాలంలో తమ యూనియన్ హైదరాబాద్ జిల్లా పక్షాన రక్తదాన శిబి రం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదాన శిబిరంలో నగరంలోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొని, సుమారు 100 యూనిట్ల రక్త దానం చేసినట్లు ఇని స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రతినిధి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్‌ఈయు జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, అశోక్‌రెడ్డి, శ్యామ్‌కుమార్‌లతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News