Wednesday, January 22, 2025

పోలింగ్ రోజు విధిగా ఉద్యోగులకు సెలవు ఇవ్వాలి!

- Advertisement -
- Advertisement -

సెలవు ఇవ్వకుంటే సంస్ధలపై చర్యలు తప్పవు: ఈసి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో ప్రైవేటు సంస్ధలు, ఐటీ కంపెనీలు ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ సెలవు ప్రకటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

గత 2018 అసెంబ్లీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో కొన్ని సంస్థలు సెలవు ఇవ్వలేదని అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయని గుర్తుచేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో కార్మిక శాఖ పరిశీలించాలని ఈసి ఆదేశాలు జారీ చేసింది. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News