Thursday, December 26, 2024

సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : సుధీర్ఘకాలంగా రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారులు (ఏటీవో)లకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని వారి సర్వీసులను క్రమబద్ధ్దీకరించారు. చాన్నాళ్లుగా నీరిక్షణకు ఏట్టకేలకు సీఎం కేసీఆర్ వెలువరించిన ఉత్తర్వుల మేరకు 230 మంది ఏటీవోల సర్వీసులు రెగ్యులరైజ్ అయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి నాంపల్లిలోని తెలంగాణ ఉద్యోగ భవన్‌లో ఉద్యోగులు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదలు తెలిపారు. అనంతరం సంబరాలు నిర్వహించారు. స్వీట్లు పంపిణీచేసి ఆనందడొలికల్లో మునిగిపోయారు.

రాష్ట్ర అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తమ కుటుంబం జీవితాలను మెరుగుపర్చినందుకు ఆయనకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, హైదరాబాద్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీలను సన్మానించి గౌరవించారు. రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎల్.సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, కోశాదికారి చంద్‌పాషాభాయి, ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, సంయుక్త కార్యదర్శి జ్యోతి, నాయకులు భరత్, చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధి,శిక్షణ శాఖ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు జి.గోవర్ధన్ రెడ్డి, కార్యదర్శి భరత్‌కుమార్, టీఎన్జీవో కేంద్ర సంఘం సహాధ్యక్షుడు కాస్తురి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఇ.కొండల్ రెడ్డి, నాయకులు విక్రం కుమార్, పత్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News