Monday, December 23, 2024

భారీ వర్షంతో ఇబ్బందులు పడ్డ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో సాయంత్ర వేళా భారీ వర్షం కురువడంతో నగర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలు దేరిన ఉద్యోగులు భారీ వర్షం కారణంగా ఇళ్లకు చేరేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఒక్కసారిగా భారీ వర్షం కురువడంతో పలు ప్రధాన ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

దీంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోవడంతో గంటల తరబడి వాహానాలు రోడ్లపై క్యూ కట్టాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. భారీ వర్షం నేపథ్యంలో జిహెచ్‌ంసిలో అత్యవసర బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. రోడ్లుపై నిలిచిన నీటిని సహాయక బృందాలు తొలగించగా, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News