Wednesday, April 2, 2025

ఫ్యూచర్ సిటీ ఉపాధికి కేరాఫ్

- Advertisement -
- Advertisement -

 లక్షలాది యువత భవితకు భరోసా ఆదాయాన్ని పెంచాలి.. పేదలకు పంచాలి అభివృద్ధి
జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవు ఏ విధానానికైనా నూటికి నూరు శాతం ఆమోదం
లభించదు షడ్రుచుల కలయికలా బడ్జెట్ ఉగాది వేడుకల్లో సిఎం రేవంత్ వ్యాఖ్యలు

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర దేవాదాయ, పర్యాటక, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ వంటి కొత్త నగరం నిర్మించాల్సిన అవసరం ఉందని, ఫ్యూచర్ సిటీ అంటే ప్రజలు నివసించే నగరమే కాదని, పెట్టుబడుల నగరం అన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడతామని, అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవన్నారు.

ఏ విధానానికి నూటికి నూరు శాతం ఆమోదం ఉండదని, దేవుళ్లను విశ్వసించే విషయంలోనే ఏకపక్ష ఆమోదం ఉండదని ముఖ్యమంత్రి- రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని, దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి యత్నిస్తున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రజలు నివసించే నగరమే కాదని, పెట్టుబడుల నగరమని, లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుందని తెలిపారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవన్నారు. ఏ విధానానికీ నూటికి నూరు శాతం ఆమోదం ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

షడ్రుచుల కలయికలా రాష్ట్ర బడ్జెట్ : ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ షడ్రుచుల కలయికలా ఉందని అన్నారు. ఆదాయం పెంచాలని, పేదలకు పంచాలనేదే ఆయన ఆలోచనని వెల్లడించారు. బడ్జెట్‌లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని, ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకురావాలని యత్నిస్తున్నామన్నారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

అత్యధికంగా వరి పండించిన రాష్ట్రం : శ్రీమంతుల మాదిరే పేదలూ సన్నబియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో గత ఏడాది 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీగా ఉత్పత్తి జరగలేదని తెలిపారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా ఇస్తున్నామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 60 నుంచి 65 శాతం మంది సన్నబియ్యం పండిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదని, అభివృద్ధి చేసే సమయమని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం సంస్థలు, పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News