Monday, December 23, 2024

ఉపాధి హామీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట రూరల్ : మండల పరిధిలోని మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం కి ంద జరిగిన పనుల విషయంపై 13వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని మండల కేంద్రంలో బుధవారం నిర్వహించారు. ఈ సామాజిక తనిఖీలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా ఉపాధి హమి అడిషనల్ డైరెక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ కొ న్ని గ్రామాలలో కూలీలు పనిచేయకపోయినా డబ్బులు వారి అకౌంట్లలో జమ చేశారని, అలాగే మ రికొన్ని గ్రామాలలో కూలీలు చేసిన పనులకు తక్కువ రోజులు డబ్బులు అకౌంట్లో జమ చేశారని అ న్నారు.

అలాగే జాబ్ కార్డుకు సంబంధించిన ఆప్డే ట్ జరగనట్లుగా తనిఖీల్లో తేలిందని, అలాగే బీపిల వద్ద రీకల్స్ సమావేశం ఎక్కడా నిర్వహించలేదని, రైతుల వ్యవసాయ పొలాలలో జరిగిన పనులకు స ంబంధించి ఆ రైతుల నుంచి ఎక్కడ సంతకాలు సేకరించలేదని, ఇష్టానుసారంగా రికార్డులు నమో దు చేశారని ఉపాధి హామీకి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించడలేదని, నమోదు ప్ర క్రియ అంతంతమాత్రంగా చేశారని ఆయన అన్నా రు.

పెద్ద తండ గ్రామ పంచాయతీలో రైతులకు మొక్కలు పెంచుకోవాలని అందజేస్తే ఆ మొక్కల లో 50శాతం మొక్కలే మిగిలి ఉన్నాయని మిగిలిన మొక్కలు కనుమరుగైనట్లు విచారణలో వెల్లడైంద ని, జరుగుతున్న పనులపై సంబంధిత మండల అ భివృద్ధి అధికారులు ఆ పనుల విషయంపై రోల్ కా ల్ చేయాల్సి ఉండగా ఏ ఒక్కరూ కూడా ఆ పనుల పై చర్యలు చేపట్టలేదని సభ దృష్టికి వచ్చింది. ప్రతి గ్రామంలో పనులకు సంబంధించిన బోర్డుల ఏర్పా టు చేయాలని ఎన్ని లక్షల పనులు చేశారు, ఎక్కడెక్కడ ఎన్ని పనులు చేశారు, ఎంత మంది రైతులకు లబ్ధి చేకూరిందనే విషయాలకు సంబంధించిన బో ర్డులు తనిఖీల్లో ఎక్కడా కనిపించలేదని తెలిపారు.

సామాజిక తనిఖీ నిర్వహిస్తుండగా జిల్లా అడిషనల్ రాజేశ్వరి డైరెక్టర్ కల్పించుకుని మహాత్మ గాంధీ ఉపాధి హామి పథకానికి సంబంధించిన సామాజిక తనిఖీ విషయంలో సక్రమంగా ఆడిట్ జరగడం లే దని, దాని ఉద్దేశం నెరవేర్చడంలో విఫలం చెందుతున్నారని అన్నారు. సోషల్ ఆడిట్ టీంపై పనుల విషయం జరిగిన విచారణపై ఎక్కడైనా అనుమానాలు జరిగితే ఆ గ్రామాలలో తిరిగి మరల విచార ణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శాంతాబాయి, ఎంపిడిఓ మధుసూదన్ గౌడ్, ఏపిఓ వెంకటేశ్వరు ఏపి డి. శ్రీనివాసులు, డివిఓ నసీరుద్దీన్, అంబుర్స్‌మెన్ జంగయ్య, ఎన్‌ఆర్‌పి కొండలు, ఎస్టిఎం సాయి గణేష్, ఏపిఓ పర్వతాలు, ఈసి భాస్కర్, పంచాయతి కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News