- Advertisement -
హైదరాబాద్ : కేంద్రం ప్రభుత్వం 2023 -24 సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాలను పెంచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇప్పటి వరకున్న రూ.257 కూలీని.. రూ.272కి పెంచింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికంగా హర్యానలో రూ.357, కేరళలో రూ.333, గోవాలో రూ.322, కర్ణాటకలో రూ.316, లక్షద్వీప్‌లో రూ.304, పంజాబ్‌లో రూ.303గా నిర్ధారించారు. పెంచిన ఉపాధిహామీ వేతనం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇవి అమలులోకి వస్తాయి.
- Advertisement -