Monday, December 23, 2024

ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే కేంద్రం విడుదల చేయాలి: బికెఎంయు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: సామాజికంగా అట్టడుగు వర్గాల జీవనోపాధికి భరోసా కల్పిస్తున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామి పథకం చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్రలు పన్నుతోందని తెలంగాణ రాష్ట్ర వ్యవస్యా కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ ఆరోపించారు. పేదరిక నిర్మూలన పథకమైన గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా బడ్జెట్‌లో భారీ కోతలు విధిస్తూ రాష్ట్రాలకు ప్రభుత్వా నిధులను కేటాయించకపోవడం, అదనుపు నిధుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోకపోవడమే కాకుండా చెల్లింపుల్లో జ్యాపం చేస్తు మోడీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. బికెఎంయు , ఎఐఎ డబ్లూ యు జాతీయ సమితి పిలుపు మేరకు గురువారం నగరంలోని గ్రామీణభివృద్ది , గ్రామీణ ఉపాధి హామి శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద బికెఎంయు, ఎఐఎడబ్లూ యు రాష్ట్ర శాఖల సంయుక్త ఆధర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బాలమల్లేష్ మాట్లాడుతూ లక్షల కోట్ల రూపాయాల రుణాలను తీసుకుని బ్యాంకులను కొల్లగొట్టిన కార్పొరేట్ సంస్థలకు రుణాలను మాఫీ చేయడానికి కేంద్రం వద్ద పుష్కలంగా డబ్బు ఉంది కాని, గ్రామీణ హామీపథకం కింద కూలీలు న్యాయమైన పని చేసి నెలల తరబడి వేతానాల కోసం ఎదరుచూస్తున్న కార్మికులకు జీతాలను చెల్లించడానికి డబ్బు లేకపోవడం దారుణమని విమర్శించారు.

కేంద్రం ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను కేంద్ర ప్రభుత్వ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ప్రతినిధి బృందం గ్రామీణాభివృద్ది, ఉపాధి హామీ శాఖ ప్రత్యేక కమీషనర్ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేసి కేంద్రానికి పంపాల్సిందిగా కోరారు. ఈ ధర్నాలో బికెఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతయ్య, నాయకులు టి.శంకర్, కె. జయలక్ష్మి, జంగయ్య, ఆర్, కృష్ణమూర్తి, కల్పనా, బి.యాదమ్మ, ఎఐఎడబ్లూయు నాయకులు కె.జగన్, బి.పద్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News