Friday, December 27, 2024

గంగపుత్రులు, ముదిరాజ్‌లకు ఉపాధి

- Advertisement -
- Advertisement -

 

సదాశివనగర్ : సదాశివనగర్ పాత చెరువులో ఆదివారం ఎంపిపి గైని అనసూయ రమేష్ స్థానిక సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసీ పాపనోల్ల బీరయ్య,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వడ్ల రాజెందర్, గంగపుత్ర సంఘం అద్యక్షుడు బాబయ్య చేప పిల్లలను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఎంపిపి అనసూయ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాలతో గంగపుత్రులు, ముదిరాజ్ లకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ సహాకారాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. 2 లక్షల 50 వేల చేప పిల్లలను చెరువులో ఒదిలినట్లు మత్య సహాకార ఫీల్డ్ ఆఫీసర్ నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News