Friday, December 27, 2024

జాబ్‌మేళాతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

- Advertisement -
- Advertisement -
  • ఆత్మకూర్ నగేష్ ఫౌండేషన్ కృషి మరువలేనిది
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్

కొండాపూర్: తెలంగాణ రాష్ట్రం కార్పొరేట్ కంపెనీలకు కేరాఫర్‌గా నిలిచిందని, దేశంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్‌లోని గోకుల్ ఫంక్షన్ హాల్‌లో ఆత్మకూర్ నగేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళాను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆత్మకూర్ నగేష్ అధ్యక్షతన జరిగిన జాబ్‌మేళాను రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ బిక్షపతిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద ప్రముఖ కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొని స్థానిక యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆనందంగా ఉందన్నారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్‌మేళాను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించడం ఆత్మకూర్ నగేష్ ఫౌండేషన్ కృషి చేయడం బాగుందన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ జాబ్ మేళాలో దాదాపు వందకు పైగా కంపెనీలు పాల్గొన్నాయి. జాబ్ మేళాలలో ఎంపికైన దాదాపు 500ల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, సిడిసి చైర్మెన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజి చైర్మెన్ విజేందర్‌రెడ్డి, కౌన్సిలర్ రామప్ప, బిఆర్‌ఎస్ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు,మల్లాగౌడ్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News