Friday, November 22, 2024

అయోధ్య యువతకు మహత్తర అవకాశం

- Advertisement -
- Advertisement -

అయోధ్య : అయోధ్యలోని వివాదాస్పద ప్రదేశంలో రామ మందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు 2019లో చారిత్రక తీర్పు వెలువరించినప్పుడు దిలీప్ పాండే ఢిల్లీలో ఒక వస్త్ర దుకాణంలో దర్జీగా పని చేశారు. అయోధ్య స్వస్థలమైన పాండే 2020లో కొవిడ్ 19 సంక్షోభం మొదలైన తరువాత తన ఇంటికి తిరిగి వచ్చారు. అయోధ్యలోనే ఉపాధికి అవకాశం ఉంటుందని గ్రహించిన పాండే ఢిల్లీకి ఇక తిరిగి వెళ్లరాదని నిశ్చయించుకున్నారు. పాండే ఇప్పుడు అయోధ్యలోనే ఒక చిన్న పర్యాటక, రవాణా సంస్థను నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు వచ్చేవారికి నగర సందర్శనకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22న రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠతో అయోధ్యను సందర్శించే భక్తుల సంఖ్య పెరిగిన దృష్టా తన వ్యాపారాన్ని విస్తరించాలని 28 ఏళ్ల పాండే యోచిస్తున్నారు.

‘నాకు ప్రస్తుతం మూడు మధ్య తరహా వ్యాన్లు ఉన్నాయి. వాటిని సందర్శకులు అయోధ్య పరిసరాలలో తిరిగేందుకు బాడుగకు తీసుకుంటున్నారు. భక్తుల సంఖ్య పెరుగదలతో వారి కోసం రెండు ఎస్‌యువిల కొనుగోలుకు రుణం తీసుకోవాలని యోచిస్తున్నాను’ అని పాండే తెలిపారు. చదువులపై అమిత ఆసక్తి ఉన్నా ఉపాధి కోసం అయోధ్య కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం తరువాత పాండే బయటకు వచ్చేశారు. ‘కొన్ని సంవత్పరాల క్రితం వరకు మాకు ఏవో కొన్ని ఆలయాలు తప్ప అయోధ్యలో మాకు మరేమీ లేవు. ఇక్కడ అవకాశాల కొరతతో ఉపాధి కోసం ఈ ప్రదేశం వదలి వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి మారిందని భావిస్తున్నాను’ అని పాండే చెప్పారు. పాండే మాదిరిగా ఈ ఆలయ నగంలోని యువజనులు భవిష్యత్తులో తమకు మెరుగైన ఉపాధి అవకాశాలు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. సేవ పరిశ్రమలో ముఖ్యంగా పర్యాటకానికి సంబంధించిన రంగాలలో మె రుగైన అవకాశాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

గత మంగళవారం శ్రీరాముని దర్శనం కోసం ప్రపంచం అంతటి నుంచి ఐదు లక్షల మందికి పైగా భక్లు వచ్చినప్పుడు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. గత వారాంతానికి ఆలయాన్ని దర్శించిన భక్తుల సంఖ్య పది లక్షలు దాటిందని ఆలయం ట్రస్ట్ అధికారులు తెలియజేశారు. కాగా, నగరంలో చాలా హోటళ్లు మార్చి వరకు పూర్తిగా రిజర్వ్ అయ్యాయి. ఫలితంగా పర్యాటకులు పరిసర జిల్లాలు బారాబంకి, బస్తీ, తుదకు లక్నో, గోరఖ్‌పూర్ వంటి ప్రదేశాలలో వసతి కోసం చూడవలసి వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News