Thursday, January 23, 2025

న్యాక్‌తో ఉద్యోగ ఉపాధి అవకాశాలు

- Advertisement -
- Advertisement -
  • సిద్దిపేట న్యాక్ భవనం రాష్ట్రానికె మోడల్ గా నిర్మించాలి
  • న్యాక్, ఎల్ అండ్ టి తో ప్రతి ఏట 300 మంది నిర్మాణరంగ కార్మికులకు శిక్షణ
  • రూ.10 కోట్లతో న్యాక్ వృత్తి నైపుణ్య భవన నిర్మాణం
  • న్యాక్ భవన నిర్మాణానికి శంకుస్థాపనఏసిన మంత్రి మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: భవన నిర్మాణ రంగంలో ఉమ్మడి మెదక్ జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సిద్దిపేట పెద్దపీట వెయ్యనుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామ శివారు ఏఆర్ సబ్ హెడ్ క్వార్టర్స్ ఎక్స్ రోడ్ వద్ద 10 కోట్ల వ్యయంతో న్యాక్ భవన నిర్మాణానికి జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధిపేటలో శాశ్వత నైపుణ్య భవన నిర్మాణంతో ఉమ్మడి మెదక్ జిల్లా నిర్మాణ రంగ నిరుద్యోగులకు ఊరట కలుగనున్నదని తెలిపారు. రాష్ట్రంలోనే మోడల్ గా న్యాక్ భవన నిర్మాణం ఉండాలని గుత్తేదారును ఆదేశించారు. ఈ భవనం పూర్తయితే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్-న్యాక్ సెంటర్‌లో లార్సన్ అండ్ టూబ్రో – ఎల్ అండ్ టీ సంస్థ ప్రతియేటా 300 మంది నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ లభించనున్నదని తెలిపారు.

యువత శిక్షణ కోసం హైదరాబాదులోని హైటెక్ సిటీలో ఉన్న న్యాక్ వరకూ వెళ్ళకుండా సిద్దిపేటలోనే ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వృత్తి నైపుణ్యం కోసం హైదరాబాద్‌లో ఉన్న న్యాక్- నిర్మాణ రంగంలో మెళుకువలు జాతీయ శిక్షణా కేంద్రం అనుబంధంగా సిద్దిపేటలో ఇప్పటికే న్యాక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసుకున్న సంగతి గుర్తు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ భవనాన్ని ఆధునిక వసతులతో నిర్మించ తలపెట్టినట్లు, ఈ భవనంలో క్లాస్ రూమ్ లు, లైబ్రరీ రూమ్స్, ప్యాకల్టీ, ప్రిన్సిపాల్ రూమ్స్, డైనింగ్ అండ్ కిచెన్ హాల్, మల్టీ పర్పస్ హాల్స్, డార్మెంటరీ నిర్మాణం జరుగుతుందని, అలాగే మెయిన్ రోడ్ ఫేసింగ్ లో అందంగా భవన నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నర్సింగ్ కౌన్సిలింగ్ మెంబర్ బాల సాయిరాం బిఆర్‌ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి కొండం సంపత్ రెడ్డి సఖి ఆనంద్ మెరుగు మహేష్ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News