Wednesday, January 22, 2025

టాటా మోటార్స్ భాగస్వామ్యంతో స్నేహ గ్రూప్ వ్యాపారం బలోపేతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్నేహ గ్రూప్ తన వ్యాపారాన్ని టాటా మోటార్స్ భాగస్వామ్యంతో మరింత బలోపేతం చేయనుంది. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న పౌల్ట్రీ, వ్యవసాయ వ్యాపార రంగంలో ఇది బలమైన కూటమిగా ఉండనుంది. 2023-24లో 8-10 శాతం ఆదాయ వృద్ధి రేటు అంచనా వేశారు. 2028 నాటికి అంచనా వేసిన విలువ 2023 నుండి 10.18 శాతం కాగర్‌తో రూ. 3,477.8 బిలియన్లుగా ఉంది.

ఈ విజయవంతమైన భాగస్వామ్యం గురించి స్నేహ ఫార్మ్ వైస్ ప్రెసిడెంట్ ఎ. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, 2018లో పెరుగుతున్న డిమాండ్, రోజువారీ కార్యకలాపాల అవసరానికి గాను 6 ఎల్‌పిటి 407 వాహనాలను కొనుగోలు చేయడానికి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. స్నేహ గ్రూప్ రోజువారీ కార్యకలాపాలకు వెన్నెముకగా ఉన్న 200 టాటా మోటార్స్ వాహనాల సముదాయాన్ని నిర్వహించడంలో గర్వంగా ఉందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News