Monday, December 23, 2024

ఫిక్కీ , విఎస్‌టి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా సాధికారత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) విఎస్ టి ఆధ్వర్యంలో రెండు రోజుల మహిళా సాధికారత కార్యక్రమం ఘనంగా జరిగింది. మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై రెండు రోజుల పాటు కార్యక్రమం నిర్వహించారు. గద్వాల్ జిల్లా కలెక్టర్, జిల్లా అధికారుల సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమంలో అలంపూర్, ఇటిక్యాల, ఉండవల్లి, వడ్డేపల్లి, రాజోలి మానుపాడు, అయిజ మండలాల నుంచి మహిళలు పాల్గొన్నారు.

బతుకమ్మ పండుగ, పిత్రు అమావాస్య మొదటి రోజు అయినప్పటికీ దాదాపు 120 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఆశా వర్కర్లు, స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ, జిల్లా వైద్య శాఖల నుంచి పలువురు మహిళా ఔత్సాహికులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో పలు క్రీడలు నిర్వహించారు.

VST

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News