Thursday, January 23, 2025

వెస్లీ-ఎనా జోడీకి టైటిల్

- Advertisement -
- Advertisement -

Ena Shibahara and Wesley Koolhof win French Open

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను రెండో సీడ్ ఎనా శిబహారా (జపాన్)వెస్లీ కుల్‌హాఫ్ (నెదర్లాండ్) జోడీ సొంతం చేసుకుంది. ఫైనల్లో ఎనా జంట 76, 62 తేడాతో జొరాన్ విగెన్ (బెల్జియం)ఉల్‌రికె ఇకెరి (నార్వే) జోడీని ఓడించింది. తొలి సెట్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. ఇరు జోడీలు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడాయి. దీంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులోఎనా జోడీ విజయం సాధించింది. ఇక రెండో సెట్‌లో పోరు ఏకపక్షంగా సాగింది. వెస్లీఎనా జోడీ అలవోక విజయంతో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. వీరు జంటగా బరిలోకి దిగిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే టైటిల్స్ సాధించి పెను ప్రకంపనలు సృష్టించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News