Wednesday, January 22, 2025

గుంటూరులో తమ ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ ఔట్‌లెట్‌ను ప్రారంభించిన ఎనమార్‌..

- Advertisement -
- Advertisement -

గుంటూరు: మహిళల కోసం మోడెనిక్‌ లైఫ్‌స్టైల్‌ యొక్క ప్రీమియం లింగ్రీ బ్రాండ్‌, ఎనమార్‌, తమ ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ ఔట్‌లెట్‌ను గుంటూరులో ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. ఈ స్టోర్‌ లో పూర్తి స్థాయిలో ఎనమార్‌ ఉత్పత్తులను అందిస్తారు. వీటిలో అథ్లీజర్‌, బ్రాలు, క్యాజువల్‌ వేర్‌, షేపర్స్‌, ప్యాంటీలను ఒకే గూటి కింద అందించడంతో విభిన్న రకాల సైజులు, ఆకృతులు కలిగిన మహిళల అవసరాలను తీరుస్తారు.

ఎనమార్‌ యొక్క ఔట్‌లెట్స్‌ ప్రత్యామ్నాయ షాపింగ్‌ అనుభవాలను మరింత ఆకర్షణీయమైన రిటైల్‌ అనుభవాలను సృష్టించడం ద్వారా అందిస్తాయి. కేవలం తమ ఉత్పత్తుల కొనుగోలు ద్వారా మాత్రమే కాకుండా లీనమయ్యే, సమగ్రమైన అనుభవాలను అందించడం ద్వారా కూడా బ్రాండ్‌ యొక్క విలువలను వినియోగదారులు అనుభవించాలని ఎనమార్‌ లక్ష్యంగా చేసుకుంది.

ఈ సందర్భంగా మోడెనిక్‌ లైఫ్‌స్టైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ శ్రీ సునీల్‌ సేథీ మాట్లాడుతూ ‘‘గుంటూరు లాంటి బలమైన మార్కెట్‌ పట్ల మేము నమ్మకంగా ఉన్నాము. ఇక్కడ భారీ అవకాశాలు ఉన్నాయి. ఎనమార్‌ యొక్క నూతన ఈబీఓను నగరంలో ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ ఆవిష్కరణతో, మేము ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించడంతో పాటుగా రాష్ట్రంలో మా కార్యకలాపాలు విస్తరించాలనుకుంటున్నాము. గుంటూరులోని మా వినియోగదారులకు ఎనమార్‌ ఆఫరింగ్స్‌తో సమగ్రమైన అనుభవాలను తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. రాబోయే కొద్దినెలల్లో టియర్‌ 2 నగరాలలో ప్రత్యేకంగా ఆఫ్‌లైన్‌ స్టోర్లను ప్రారంభించడం ద్వారా మా కార్యకలాపాలు విస్తరించాలనుకుంటున్నాము’’ అని అన్నారు

ఈ ప్రారంభం గురించి వీనేష్‌ ప్రియదర్శి, చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌, మోడెనిక్‌ లైఫ్‌స్టైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘ ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరాలలో గుంటూరు ఒకటి. మేము లక్ష్యంగా చేసుకున్న విభాగాల్లోని వినియోగదారులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ఎక్స్‌క్లూజివ్‌ ఎనామర్‌ ఔట్‌లెట్లు మా వృద్ధి కార్యక్రమంలో అత్యంత కీలకం. వీటిని మా వినియోగదారులు చక్కగా స్వీకరించారు. ఈబీఓలలో మా పెట్టుబడులను కొనసాగించనున్నాము’’ అని అన్నారు.

గుంటూరులో ఎనామర్‌ యొక్క ఈబీఓ (ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ ఔట్‌లెట్‌), దేశంలో సంస్ధకు 53వ ఔట్‌లెట్‌. బెంగళూరు, ముంబై, ఢిల్లీ/ఎన్‌సీఆర్‌, పూనె, హైదరాబాద్‌, లక్నో తదితర టియర్‌ 1, టియర్‌ 2 నగరాలలో 52 ఔట్‌లెట్లు విజయవంతమైన తరువాత,ఈ బ్రాండ్‌ గణనీయంగా తమ పెట్టుబడులను ఈబీఓలలో పెట్టింది. తద్వారా రాబోయే 12–16 నెలల్లో 70 స్టోర్లను తెరువనుంది. ఓమ్నీ ఛానెల్‌ వ్యూహంపై పెట్టుబడులు పెట్టి, ఎనమార్‌ తమ ఈ–కామర్స్‌ ఛానెల్‌ను సైతం నిర్మించుకోనుంది. అంతేకాదు, ఈ–కామర్స్‌ రంగంలో వృద్ధిని ఆశిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News