Tuesday, January 7, 2025

అన్నంలో విష ప్రయోగం!.. ఎన్‌కౌంటర్‌పై గుత్తికోయల అనుమానాలు

- Advertisement -
- Advertisement -

ములుగు జిల్లాలోని చల్పాకలో ఆదివారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఏడుగురు కీలక మావోయిస్టులను భద్రతా దళాలు అతమార్చాయి. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై గొత్తికోయలు అనుమానాలు వ్యక్తం చేశారు. అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు సమాచారం ఉందని ఆరోపించారు. దీంతో మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం చేయించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది.

ఈ ఎన్‌కౌంటర్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ ‘అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు, బూటకపు ఎన్‌కౌంటర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయి’ అని ట్వీట్ చేశారు. దీంతో మావోల ఎన్ కౌంటర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News