Sunday, December 22, 2024

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్… ఐదుగురు నక్సల్స్ మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై/గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఐదుగురు నక్సలైట్లు మరణించినట్లు పోలీసులు తెలిపారు. భమ్రాగఢ్ లాలూకాలోని అడవులలో జరిగి న ఈ ఎన్‌కౌంటర్‌లో గడ్చిరోలి పోలీసులకు చెం దిన సి 60 ప్రత్యేక విభాగంలోని కమాండోలు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు చెప్పారు.
నెలరోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ కాల్పుల పోరు జరిగింది.

నవంబర్ 20 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్టా దాడి చే సేందుకు మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవు ల్లో కొందరు నక్సలైట్లు మాటువేశారని గడ్చిలోని ఎస్ పి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నక్సలైట్లు మాటు వేసిన ప్రదేశం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి చెందిన నక్సల్ ప్రభావిత నారాయణ్‌పూర్ సరిహద్దులని తెలిపింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News