Wednesday, January 22, 2025

ఎన్నికల ముంగిట్లో ఎన్‌కౌంటర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికలను దృ ష్టిలో పెట్టుకుని ఎలాంటి విధ్వంస కాండ జ రగకుండా నివారించడానికి నక్సల్ ప్రభావి త ప్రాంతాల్లో గాలింపు చర్యలు పోలీస్‌లు ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర లోని గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్ లోని దంతెవాడ జిల్లాల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌కుసంబంధించి తెలంగాణ సరిహద్దు నుం చి మావోయిస్టులు మహారాష్ట్ర లోకి ప్రవేశిస్తుండగా, భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు హ తమయ్యారు. వీరంతా తెలంగాణ కమిటీకి చెందిన వారిగా పోలీస్‌లు గుర్తించారు. వీరి పై రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం.

మృతులు మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తు , కుర్సింగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌లుగా గుర్తించారు. సంఘటన స్థలం నుంచి ఏకే 47, తు పాకులు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.మిగతా వా రి కోసం గాలిస్తున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విధ్వంసం సృష్టించాలన్న లక్షంతో పొరుగునున్న తెలంగాణ నుంచి ప్రా ణహిత నదిని దాటుకుంటూ మహారాష్ట్ర లోకి ప్రవేశిస్తున్నారని సోమవారం మధ్యాహ్నం సమాచారం అందిందని పోలీస్ సూపరింటెండెంట్ నీలోత్పల్ చెప్పారు. దీంతో అప్రమత్తమై గడ్చిరోలి పోలీస్ విభాగానికి చెందిన సి20 ప్రత్యేక భద్రతా దళాలు గాలింపు చేపట్టాయని చెప్పారు. రేపనపల్లి సమీపాన కొలమార్క కొండల్లో మంగళవారం ఉదయం నక్సల్స్ ఎదురుపడడంతో భద్రతా దళాలకు , నక్సల్స్‌కు మధ్య ఎదురెదురు కాల్పులు జరిగాయి. కాల్పులు తరువాత సంఘటన స్థలంలో నలుగురు నక్సల్స్ మృతదేహాలను పోలీస్‌లు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News