- Advertisement -
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. శనివారం రాత్రి అబుజ్మద్ అటవి ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపారు.
ఈ ఎన్ కౌంటర్ నలుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. సంఘటనాస్థలం నుంచి మృతదేహాలతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో AK-47, స్వీయ-లోడింగ్ రైఫిల్ (SLR), ఇతర ఆటోమేటిక్ ఆయుధాలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఎన్ కౌంటర్ లో తీవ్రంగా దంతెవాడ డీఆర్ జీ హెడ్ కానిస్టేబుల్ సన్ను కరమ్ మరణించాడు. ప్రస్తుతం మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతుందని పోలీస్ ఉన్నతాధాకారి తెలిపారు.
- Advertisement -