Monday, December 23, 2024

కొండ ప్రాంతాల్లో ముష్కరులు.. కొనసాగుతోన్న ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత సైన్యంచేపట్టిన ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. కొండ ప్రాంతాల్లో నక్కిన ముష్కరులతో కొనసాగుతోన్న ఎన్‌కౌంటర్ 100 గంటలు దాడినా ఇంకా పూర్తి కాలేదు. ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. శత్రువులు యుద్ధమే కోరుకుంటే , చివరికు వారి పిల్లలను వేరే వాళ్లు పెంచాల్సి వస్తుందంటూ ఘాటుగా స్పందించారు. ‘ భారత్‌కు శత్రువులు ఉన్నారు. వారు దేశ పురోగతిని అడ్డుకోవాలని కోరుకుంటున్నారు. అయితే వారు తెలుసుకోవాల్సింది ఒక్కటే. మా సైన్యం అత్యాధునికి సాంకేతికత , అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను కలిగి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది సరికొత్త భారత్. బెదిరింపులకు భయపడదు. వెనక్కి తగ్గదు. ఇప్పటికే యుద్ధాలను చూసిన భారత్ .. వాటిని కోరుకోవడం లేదు. కానీ ఎవరైనా యుద్ధాన్నే కోరుకుంటే , వాళ్ల పిల్లల్ని ఇతరులు పెంచాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News