Wednesday, January 22, 2025

బీజాపూర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు నక్సల్స్ మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకోవడంతో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి, ఎకె 47 రైఫిళ్లు, నిషేధిత సాహిత్య పుస్తకాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సోమవారం బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీకరుబట్టి-పుస్బాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోలు మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News