- Advertisement -
బీజపూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజపూర్ జిల్లాలో భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి చెందాడు. ఈ సందర్భంగా మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ముంగా గ్రామంలో మావోయిస్టు డివిజన్ కమిటీ మెంబర్ దినేష్ మొదియమ్, కమాండర్ వెల్లాతోపాటు దాదాపు 40 మంది భేటీ అయ్యారన్న సమాచారం మేరకు భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా మావోయిస్టులు తారసపడడంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. సంఘటన స్థలం నుంచి మావోయిస్టులకు చెందిన 9 ఎంఎం పిస్టల్, మందుపాతర, ఆరు రిమోట్‌స్విచ్‌లు, ఇతర వస్తువులు పోలీసులకు లభించాయి. గాయపడ్డ రిజర్వు గార్డులను ఆస్పత్రిలో చేర్చారు.
- Advertisement -