Friday, December 20, 2024

ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ మృతి..

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లాలో పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్ట్ మృతి చెందాడు. శనివారం జిల్లాలోని బామ్రాఘడ్ తాలూక అబుజ్ మడ్ అటవిప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్ట్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహంతోపాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని ఓ పోలీస్ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News