Monday, December 23, 2024

కుష్వారాలో చొరబాటుకు యత్నించిన పాక్ ఉగ్రవాది హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని కుష్వారా లో దేశం లోకి అక్రమ చొరబాటుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని భద్రతా బలగాలు అంతమొందించాయి. కుష్వారా లోని సైడ్ పొరా లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉగ్రవాదులు అక్రమ చొరబాటుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఆర్మీకి అందింది. దీంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పాక్ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News