Monday, April 7, 2025

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది, సైనికుడు మృతి

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది, సైనికుడు మృతి చెందారు. కుప్వారా లోని కౌట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఇండియన్ ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీస్ సంయుక్త గాలింపు చర్యలు చేపట్టాయి. మంగళవారం రాత్రి ఉగ్రవాదుల కదలికలు కనిపించడంతో ఆర్మీ దళాలు హెచ్చరించాయి. దీనికి ప్రతిగా ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడడంతో ఎన్‌కౌంటర్‌కు దారి తీసిందని ఆర్మీ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ సంఘటనలో ఉగ్రవాదిని హతం చేయగా, సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడని, తరువాత మృతి చెందాడని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News