Friday, November 22, 2024

కాంచీపురంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు రౌడీషీటర్ల హతం

- Advertisement -
- Advertisement -

చెన్నై : చెన్నై లోని కాంచీపురంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీలను కాంచీపురం పోలీస్‌లు కాల్చి చంపారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీస్‌లను హత్య చేయడానికి వారు ప్రయత్నించగా వారు ఎదురు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ జరిగింది. మరో రౌడీ షీటర్ ప్రభ హత్య కేసులో వీరిద్దరినీ పట్టుకునేందుకు పోలీస్‌లు ప్రయత్నిస్తుండగా ఈ సంఘటన జరిగింది.

పేరు పొందిన రౌడీ శరవణన్ అలియాస్ ప్రభాకరన్ (35)ను హత్య చేసిన కేసులో రఘువరన్, ఆసన్ ( అలియాస్ కరుప్పు హసన్ ) నిందితులుగా ఉన్నారు. ఈ ఇద్దరూ కాంచీపురం కొత్త రైల్వేబ్రిడ్జి సమీపంలో తలదాచుకున్నట్టు పోలీస్‌లకు సమాచారం అందింది. దీంతో బుధవారం తెల్లవారు జామున వీరిద్దరినీ అరెస్ట్ చేయడానికి వెల్లతురై నేతృత్వం లోని స్పెషల్ ఫోర్స్ పోలీస్‌లు అక్కడికి వెళ్లగా నిందితులు తప్పించుకోడానికి ప్రయత్నించారు.

పోలీస్‌లపై ఎదురు దాడికి పాల్పడ్డారు. తమ వద్ద ఉన్న కొడవలి కత్తితో దాడి చేయగా ఎఎస్‌ఐ రామలింగం, కానిస్టేబుల్ శశికుమార్ గాయపడ్డారు. లొంగిపోవాలని పోలీస్‌లు హెచ్చరించినా వినిపించుకోలేదు. ఆత్మరక్షణ కోసం పోలీస్‌లు కాల్పులు జరపవలసి వచ్చింది. ఇద్దరి మృతదేహాలను కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభాకరన్‌పై 30 కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News