Monday, December 23, 2024

కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -

జమ్ము : జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలకు , ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుని . ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియలేదని అధికారులు తెలియజేశారు. కుల్గాం లోని రెడ్‌వానీ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల గురించి భద్రతా దళాలకు సమాచారం అందడంతో సోమవారం అర్ధరాత్రి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ పరిస్థితిలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.

ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని అధికారులు తెలిపారు . చొచ్రు గాలా ప్రాంతం లోని పనారా గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నట్టు వెల్లడించారు. ఇటీవల ఏప్రిల్ 29న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జమ్మూ జోన్ ) ఆనంద్‌జైన్ మాట్లాడుతూ రెండు ఉగ్రవాద వర్గాలకు చెందిన కొందరు సరిహద్దు దాటి అక్రమంగా దేశం లోకి చొరబడ్డారని, వారు ఇదే ప్రాంతంలో తలదాచుకుంటున్నట్టుగా అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యం లోనే భద్రతా బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. రెండు వర్గాలకు చెందిన ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతా దళాలు కథువా జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News