Monday, December 23, 2024

సుక్మాలో ఎన్‌కౌంటర్.. సీఆర్‌పిఎఫ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వీర మరణం

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లా జాగర్‌గుండలో ఆదివారం నక్సలైట్లకు, పోలీస్ బలగాలకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో సీఆర్‌పిఎఫ్‌కు చెందిన 165 బెటాలియన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి వీరమరణం పొందారు. మరో కానిస్టేబుల్ రాములుకు గాయాలయ్యాయి.

రాములును ఆస్పత్రికి తరలించారు. నలుగురు అనుమానితులను పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. సంఘటన స్థలంలో సీఆర్‌పిఎఫ్ , కోబ్రా, జిల్లా పోలీస్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వీరమరణం పొందిన సబ్‌ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. గాయపడిన జవాన్ రాములకు మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News