మనోహరాబాద్‌ః క్రీడల వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుందని, పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లిలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు లేక పిల్లల్లో శారీరక పటుత్వం తగ్గిపోతుందన్నారు. సెల్‌ఫోన్లకు అలవాటు పడిపోతున్నారన్నారు. చిన్న వయస్సులోనే ఊబకాయం, బీపీ, షుగర్లు ఇవి రాకుండా ఉండాలంటే వ్యాయమం అవసరమన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని, ఆటలు అంటే టైం వేస్ట్ అనుకుంటారని, పబ్‌జీ, ఫేస్‌బుక్ లాంటివల్ల సమయం వృధా అవుతుందన్నారు.
క్రీడల వల్ల పిల్లల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. ఓటమిని స్వీకరించేతత్వం అలవాటవుతుందన్నారు. పాస్ కాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్రీడాస్పూర్తి అలవాటు కాకపోవడమే పిల్లల్ని స్కూల్‌కు తీసుకెళ్లినట్లే క్రీడా మైదానంకు పిల్లల్ని తీసుకెళ్లే బాద్యత తల్లితండ్రులదేనన్నారు. సీఎం కేసీఆర్ పేరుతో ఈ టోర్నమెంట్ నిర్వహించిన విష్ణుజగతికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఫారెస్ట్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీచైర్ పర్సన్ హేమలతశేఖర్‌గౌడ్, మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీతరవి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అద్యక్షుడు పురం మహేష్, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.