Thursday, November 14, 2024

వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -
Encouragement for alternative crops instead of rice
 చిరుధాన్యాల సాగుకు ప్రణాళికలు : వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో వరి సాగుకు బదులు ప్రత్యా మ్నాయ పంటల సాగుదిశగా రైతులను ప్రో త్సహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసా యశాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఇక్కడ జరుగుతున్న అంతర్జాయతీయ చిరుధాన్య పంటల సదస్సు రెండవ రోజు కా ర్యక్రమాల్లా భాగంగా, శనివారం హెచ్‌ఐసిసి లో ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశంలో రఘునందన్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లారు. రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చే స్తోందన్నారు. గత కొంతకాలంగా ప్రజల ఆ హారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయని, ప్రధాన ఆహారోత్పత్తుల వినియోగంతోపాటు చిరుధాన్యల వినియోగం కూడా పెరుగుతూ వస్తోందన్నారు. రెండు మూడు దశాబ్దాలుగా తాము చిరుధాన్యాలను ఆహారంగా వినియో గించకపోవటంతో ఎంత నష్టపోయామో ప్రజ లు ఇప్పుడు గుర్తిస్తున్నారన్నారు. పంటల స రళిలో మార్పులు వస్తున్నాయన్నారు.

అయితే పెద్ద ఎత్తున వరిసాగుకు అలవాటు పడిన రై తులను వెంటనే వరిసాగును మాన్పించి ప్ర త్యామ్నాయ పంటల వైపు మళ్లించాలంటే కొంత కష్టమైన పనే అన్నారు. చిరుధాన్యాల పంటలకు మార్కెట్‌లో మంచి ధరలు కల్పిం చాల్సిన అవసరం ఉందన్నారు. చిరుధాన్యల కు మంచి మార్కెట్ సదుపాయాలు కూడా ఉం డాలని, అన్నింటికీ మించి చిరుధాన్య పంటల సాగుకు మేలురకం విత్తనాలు కూడా రైతులు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంద న్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో చిరు ధాన్య పంటల సాగు దిశగా రైతులను మళ్లిం చేందుకు అవసరమైన కృషి చేయనున్నట్టు తె లిపారు. రాష్ట్రంలో వర్షాధార భూముల్లో జొ న్నలు , సజ్జలు, రాగులు , కొర్రలు తదతర చి రుధాన్యాల సాగును ప్రొత్సహించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రలో వ్యవసాయరంగానికి మరిన్ని సేవలను అందుబాటులో ఉంచేందు కు ప్రభుత్వం సాగుబాగు వెబ్‌సైట్‌ను రూ పొందించిందన్నారు. వ్యవసాయ రంగం నిపు ణుల నుంచి కూడా సాగుబాగుకు మంచి స్పందన లభిస్తోంద న్నారు. 70వారాలుగా నడుస్తున్న ఈ కార్యక్ర మానికి ఆదరణ పెరు గుతో వస్తోందన్నారు. సాగుబాగు వెబ్‌సైట్ డాటా మార్పిడి ప్లాట్ ఫాంగా ఉపయోగపడు తోందని తెలిపారు. రాష్ట్రంలో విజయ బ్రాండ్ ఉత్పత్తుల మార్కెట్‌ను విస్తృతం చే స్తోందన్నారు. ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ ద్వారా విజయ బ్రాండ్ ఉత్పత్తులను వినియోగదారు లకు మరింత అందుబాటులోకి తెచ్చిందన్నా రు. విజయ పాలకు కూడా మంచి డిమాండ్ ఉందని రఘునందన్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News