Monday, January 20, 2025

వృత్తివిద్యకు ప్రోత్సాహం..ఉపాధికి భరోసా

- Advertisement -
- Advertisement -

బిసి గురుకులాల్లో సరికొత్త కోర్సులు
కొత్త డిగ్రీ కాలేజీల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభం

మన తెలంగాణ / హైదరాబాద్ : సాంప్రదాయ కోర్సులకు భిన్నంగా ఉపాధితో ముడిపడిన సరికొత్త కోర్సులతో బిసి గురుకులాలు బతుకు భరోసా నిస్తున్నాయి. రాష్ట్రంలోని బిసి గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రభుత్వం ఒకేషనల్ కోర్సులను ప్రవేశ పెట్టింది. డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశ పెట్టడం ద్వారా గురుకుల విద్య అనంతరం విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు మార్గం సుగమమం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా మంజూరు చేసిన 17 బిసి గురుకుల డిగ్రీ కాలేజీలలో ఉపాధి కోర్సులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కాళాశాలల్లో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ అడ్మీషన్‌ల ప్రక్రియ ప్రారంభమయ్యింది.

వికారాబాద్ డిగ్రీ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ కోర్సు బిఎ(ఆనర్స్), – సంగారెడ్డిలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు- మిగతా కాలేజీల్లో బిఎస్‌సి(ఎంపిసిఎస్), బిఎస్‌సి(బిజెడ్‌సి), బికాం, బిఎ కోర్సులు- ప్రవేశ పెట్టారు. కొత్తగా ఏర్పాటుచేసిన 17 కాలేజీల్లో వికారాబాద్ లోనిఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఫిల్మ్ అండ్ మీడియా, యానిమేషన్ అండ్ విఎఫ్‌ఎక్స్, ఫోటోగ్రఫి అండ్ డిజిటల్ ఇమేజింగ్ కోర్సులతో బిఎ(ఆనర్స్) ,సంగారెడ్డి కాలేజీలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 17 కాలేజీలతో రాష్ట్రంలో జిల్లా ఒకటి చొప్పున మొత్తం 33 బిసి డిగ్రీ కళాశాలలు పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నాయి. 33 కాలేజీల్లో సంగారెడ్డి, వికారాబాద్ లోని డిగ్రీ కాలేజీలు కో- ఎడ్యుకేషన్ కాలేజీలు కాగా మహిళా డిగ్రీ కాలేజీలు గద్వాల్, బాన్స్ వాడా( కామారెడ్డి), ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట లో ఏర్పాటు చేశామన్నారు, బాలుర డిగ్రీ కాలేజీలు నారాయణ పేట, నాగర్ కర్నూలు, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, భువనగిరిలలో అందుబాటులో ఉన్నాయి. బిసి గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్ కాలేజీ స్థాయిలో వృత్తి విద్యకు అంకురార్పణ చేసింది. విస్తృతస్థాయి ప్రచారం లేకపోవడం వల్ల ఈ కోర్సులు ప్రజల్లోకి వెళ్ళలేక పోయాయి. బిసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలోని సృజనాత్మకతను వెలికితీసే కోర్సులను, ఉపాధి అవకాశాలు కల్పించే వృత్తి విద్యా కోర్సులను ఎంపిక చేసిన బిసి గురుకులాల్లో అందిస్తున్నారు.

గతేడాది కొత్తగా 119 జూనియర్ కాలేజీలు రావడంతో బిసి గురుకుల జూనియర్ కాలేజీల సంఖ్య పెరగింది. విద్యార్థుల అభిరుచులకు, ఆసక్తికి అనుగుణంగా, ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ కోర్సులను ప్రవేశపెట్టారు. ఇంటర్ లో రెగ్యులర్ కోర్సులతో పాటు ఓకేషనల్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాలేజీ నుంచి సరాసరి కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరేలా ఈ కోర్సులను రూపొందించారు. రాష్ట్రంలోని 261 బిసి గురుకుల జూనియర్ కాలేజీలకు గాను 16 జూనియర్ కాలేజీలలో ఒకేషనల్ కోర్సులను అందిస్తున్నారు. వాటిలో 11 బాలికల జూనియర్ కాలేజీలు కాగా 5 బాలురకు సంబంధించినవి ఉన్నాయి. ముఖ్యమంగా కోహీర్, మెదక్ బాలికల జూనియర్ కాలేజీల్లో సదాసివ పేటలో బాలుర జూనియర్ కాలేజీలో ఒకేషనల్ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు విదేశాల్లో ఉపాధి పొందేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా బిసి గురుకుల జూనియర్ కాలేజీల్లో ఉపాధితో ముడిపడిన -ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ (పిఎస్‌టిటి ), కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ (సిజిఎ), అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ ( ఎసిపి ), కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ ( సిజిటి), మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎమ్‌పిహెచ్‌డబ్లు), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎమ్‌ఎల్‌టి), ఫిజియోథెరపీ (పిటి), టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (టి అండ్ హెచ్) తదితర కోర్సులను బిసి గురుకులాల్లో ప్రవేశపెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News