Friday, November 22, 2024

వి హబ్ తో మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

మహిళ కమిషన్ చైర్‌పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి

Encouragement for women entrepreneurs with V Hub
మనతెలంగాణ/ హైదరాబాద్ : మహిళా పారిశ్రామిక వేత్తలకు మద్దతు ఇచ్చేందుకు వి హబ్ లాంటి వేదికలు ప్రోత్సాహంగా ఉంటాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాటికి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో కొనసాగుతున్న వి -హబ్ ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులతో కలిసి ఆమె సందర్శించారు. వి- హబ్ బృందంతో జరిగిన సమావేశంలో చైర్‌పర్సన్ సునీత లక్ష్మారెడ్డి సిఇఒ దీప్తి రావును ప్రశంసించారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వి హబ్ అని ఆమె పేర్కొన్నారు. వి హబ్ ఇప్పటికే 2,194 స్టారట్ప్‌లు రూపకల్పన చేసిందని ఆమె అన్నారు. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్రాఈశ్వరీభాయి, కొమ్ము ఉమాదేవియాదవ్, గద్దల పద్మ, సుదాం లక్ష్మి, కటారి రేవతి రావు, కమిషన్ కార్యదర్శి కృష్ణకుమారి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News