Monday, December 23, 2024

తేనె టీగల పెంపకానికి రైతులకు ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -
వారికి దీనిని అదనపు ఆదాయ వనరుగా చేస్తాం
శాస్త్రీయ పద్దతుల్లో తేనె టీగల పెంపకంపై రాష్ట్ర స్థాయి సెమినార్‌లో వక్తలు

హైదరాబాద్ : రైతులకు అదనపు ఆదాయ వనరుగా తేనె టీగల పెంపకానికి ప్రోత్సాహం ఇస్తామని అటవీశాఖ వెల్లడించింది. ఈ మేరకుశాస్త్రీయ పద్దతుల్లో తేనె టీగల పెంపకంపై రాష్ట్ర స్థాయి సెమినార్‌ను ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించింది. నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ (NBHM) కింద ఫారెస్ట్ కాలేజీకి సమీకృత తేనె టీగల పెంపకం, శిక్షణ కేంద్రాన్ని కేటాయించింది. సుమారు ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల నిధులను సంస్థకు అందజేసింది. రైతులకు శాస్త్రీయ పద్దతుల్లో తేనె టీగల పెంపకంపై శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలను ఫారెస్ట్ కాలేజీ అభివృద్ది చేసింది. దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు రాష్ట్ర స్థాయి సెమినార్ ను సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజీలో నిర్వహించింది.

తేనె టీగల పెంపంకం దారులైన రైతులు నూతన పద్దతుల్లో తేనె టీగల పరపరాగ సంపర్కం (పాలినేషన్) ద్వారా నాణ్యమైన తేనే ఉత్పత్తి పెంపకంపై దృష్టి పెట్టాలని, అందుకు అవసరమైన శిక్షణ ఫారెస్ట్ కాలేజీ నెలకొల్పిన కేంద్రంలో పొంద వచ్చని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫారెస్ట్ కాలేజీ రైతుల కోసం మరిన్ని ఆధునిక సాగు పద్దతులపై శిక్షణ ఇచ్చేందుకు సిద్దంగా ఉందని డీన్ ప్రియాంక వర్గీస్ తెలిపారు. ఈ సెమినార్‌లో నిపుణులు, తేనెటీగల పెంపకం దారులు, రైతులు, విద్యార్థులు, వ్యవసాయాధికారులు, నేషనల్ బీ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.కె పాట్లే, నాబార్డ్ జనరల్ మేనేజన్ హరగోపాల్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ నుండి శాస్త్రవేత్తలు, ఖాదీ ,విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్, అధికారులు, సిబ్బంది, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News