Monday, December 23, 2024

1న హెచ్‌ఐసిసిలో వజ్రోత్సవ వేడుకల ముగింపు

- Advertisement -
- Advertisement -
ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కెసిఆర్ : సిఎస్ శాంతికుమారి

మనతెలంగాణ/ హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1వ తేదీన హెచ్‌ఐసిసిలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మంగళవారం వజ్రోత్సవ ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఆమె నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా. కెవి రమణచారి, దేశపతి శ్రీనివాస్, డిజిపి అంజనీ కుమార్‌లతో సహా పలువురు కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ వజ్రోత్సవ ముగింపు ఉత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని అన్నారు. శుక్రవారం జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్‌పిటిసిలు, మండల పరిషత్ అధ్యక్షులు. డిసిసిబి, డిసిఎంఎస్, రైతుబంధు సమితిల అధ్యక్షులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు గంటసేపు దేశభక్తి, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించే పలు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశం ఉంటుందని వెల్లడించారు. ఈ వజ్రోత్సవ ముగింపు వేడుకలకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా సంబంధిత అధికారులందరూ విస్తృత స్థాయిలో ఏర్పాట్లను చేయాలని అన్నారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, సందీప్ సుల్తానియా, జితేందర్, కార్యదర్శులు శ్రీనివాసరాజు, ఎస్.ఏ.ఎం. రిజ్వి, బుద్ధా ప్రకాష్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జలమండలి ఎండి దానకిషోర్, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, ఫైర్ సర్వీసుల డిజి నాగిరెడ్డి, సమాచార పౌర సంబంధాల ప్రత్యేక కార్యదర్శి అశోక్ రెడ్డి, నర్సింహా రెడ్డి, పమేలా సత్పతి, పిఆర్ కమిషనర్ హనుమంత రావు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పలు శాఖలపై సమీక్ష…
పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయం, పశుసంవర్ధక, జిహెచ్‌ఎంసి తదితర శాఖలను ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్షించారు. గత నెలలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పనుల పురోగతిని సమీక్షించారు. పంచాయితీ రాజ్, ఆర్‌అండ్‌బీ శాఖలు పెద్దఎత్తున నష్టపోయినట్లు నివేదించగా, ప్రభుత్వం మరణాల కేసుల్లో నష్ట పరిహారాన్ని విడుదల చేసిందని అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News